Site icon NTV Telugu

Sharwa 35: కృతి శెట్టికి BTS వీడియోతో బర్త్ డే విషెష్

Sharwa 35

Sharwa 35

యంగ్ హీరో శర్వానంద్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో దిట్ట… ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ ట్రాక్ ఎక్కిన శర్వా ప్రస్తుతం తన 35వ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిశాడు. న్యూ ఏజ్ సినిమాలకి కాస్త ఫన్ డోస్ ని యాడ్ చేస్తూ సినిమాలు చేసే శ్రీరామ్ ఆదిత్య, శర్వానంద్ ని మళ్లీ ‘రన్ రాజా రన్’ రోజులని గుర్తు చేసేలా చూపిస్తున్నట్లు ఉన్నాడు. లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈరోజు కృతి శెట్టి పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి కృతి బర్త్ డే విషెష్ చెప్తూ స్పెషల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు.

Read Also: Nandamuri Balakrishna: అంబటి నన్ను రెచ్చగొట్టాడు.. రా చూసుకుందాం అన్నాడు..

ఈ బిహైండ్ ది సీన్స్ వీడియోలో కృతి శెట్టి చాలా క్యూట్ గా ఉంది. శ్రీరామ్ ఆదిత్య కృతికి సీన్స్ వివరిస్తున్నట్లు కూడా ఉన్న వీడియో ఎండింగ్ లో… కృతి నవ్వుతూ ఉండగా మేకర్స్ నుంచి బర్త్ డే విషెష్ వచ్చాయి. శర్వా, కృతి ఇద్దరూ మొదటిసారి కలిసి నటిస్తున్నారు కాబట్టి ఆన్ స్క్రీన్ పెయిర్ ఫ్రెష్ గా ఉండే అవకాశం ఉంది. కృతి శెట్టికి శర్వానంద్ కి డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్యకి కూడా ఇమ్మిడియట్ గా హిట్ కావాలి. మరి ఈ ముగ్గురూ కలిసి #శర్వా35 సినిమాతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

Exit mobile version