NTV Telugu Site icon

Pathaan: బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్… దంగల్ రికార్డులు కూడా బ్రేక్

Pathaan

Pathaan

స్టార్ హీరోలు ఫ్లాప్స్ ఫేస్ చెయ్యడం మాములే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఏ హీరో క్రేజ్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో వాళ్ళే సూపర్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న హీరోలవుతారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువగా చెప్పాల్సిన వాడు షారుఖ్ ఖాన్. మూడు దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కిన షారుఖ్ ఖాన్ కి పదేళ్లుగా హిట్ అనే మాటే లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే లేదు. అలాంటి షారుఖ్ ఖాన్ అయిదేళ్ళు గ్యాప్ తీసుకోని ఆడియన్స్ ముందుకి ‘పఠాన్’ సినిమాతో వచ్చాడు. హై బడ్జట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ బాలీవుడ్ రికార్డులని తిరగరాసి, బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర తిరగరాస్తుంది. కేవలం తొమ్మిది రోజుల్లో పఠాన్ సినిమా 729 కోట్లని రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వీకెండ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి శనివారం, ఆదివారం మళ్లీ పఠాన్ కలెక్షన్స్ పుంజుకునే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే బాహుబలి 2, KGF 2 ఓపెనింగ్స్ రికార్డులని బ్రేక్ చేసిన పఠాన్ సినిమా తాజాగా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అయిన దంగల్ సినిమా కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసింది. దంగల్ సినిమా నార్త్ లో మాత్రమే 380 కోట్ల వరకూ రాబట్టింది, ఈ కలెక్షన్స్ ని పఠాన్ సినిమా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. నార్త్ లో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా ‘బాహుబలి 2’ టాప్ ప్లేస్ లో ఉంది. ఈ మూవీ 500 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది, పఠాన్ సినిమా ప్రస్తుతం ఉన్న జోష్ ని కంటిన్యు చేస్తే ఫుల్ రన్ లో బాహుబలి 2 రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసి ఇండియాస్ ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show comments