NTV Telugu Site icon

Shanthi Williams: ముందే చెప్పి చనిపోయాడు.. శవానికి బాయ్ చెప్పి షూట్ కి వెళ్ళా!

Shanthi Williams

Shanthi Williams

Shanthi Williams Emotional about Son Death: తమిళ నటి శాంతి విలియమ్స్ కుమారుడు సంతోష్ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే తన కొడుకు చనిపోయాడన్న విషయం కూడా తెలియదని, అతనితో మాట్లాడి షూటింగ్‌కి బయలుదేరానని తన బాధను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. కోయంబత్తూరుకు చెందిన శాంతి విలియమ్స్ 11 ఏళ్ల వయసులో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె బాలనటిగా అనేక చిత్రాలలో నటించింది. ఆ తరువాత నటిగా మారి తమిళం, మలయాళం భాషల్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. ఆమె కెమెరామెన్ విలియమ్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు దూరమై భర్త, పిల్లలతో కలిసి జీవించింది. భర్త విలియమ్స్ మరణం తరువాత, ఆమె ఆర్థిక సంక్షోభం కారణంగా రీ-ఎంట్రీ ఇచ్చింది. సినిమా అవకాశాలు రాకపోవడంతో స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చి మెట్టి ఓలి సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది.

Manjima Mohan: పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ.. చాలా బాధపడ్డాను- హీరోయిన్ ఆవేదన!!

అయితే ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బాధాకరం అంటూ చెప్పుకొచ్చింది. నా భర్త బతికి ఉన్నప్పుడు పెద్ద నటులంతా ఇంటికి వచ్చేవారు, వాళ్లందరికీ నేనే వంట చేసేదాన్ని. మరెవరూ వండకూడదు, నువ్వే వండాలి అనేవారు. అదేవిధంగా షూటింగ్‌కి నేనే నా చేతులతో వండి పంపిస్తాను. అలాంటి పరిస్థితి మారి ఆయన చనిపోయాక ఎవరూ ఇంటికి రాకపోతే ఆ సమయంలో రజనీ సార్ మాత్రమే మాకు సహాయం చేశారు. దానిని నేనెప్పటికీ మరచిపోలేను. కుటుంబ పరిస్థితుల కారణంగా మళ్లీ నటనలోకి వచ్చాను, ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత మెట్టి ఓలి సీరియల్‌లో అత్తగా నటించాను. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటూ పిల్లలను బాగా చదివించాను.

నా కొడుకు సంతోష్ చనిపోయాడు, ఈ దుఃఖం నుంచి నేను ఎప్పటికీ కోలుకోలేకపోయాను. నా కొడుకు చనిపోయే ముందు, నేను చనిపోతే అందరినీ చూసుకో అని చెప్పాను. అప్పుడు నా కొడుకు నువ్వు చావవు, నేను చస్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయమే చనిపోయాడు. నాకు తెలియకుండానే అతని కాలు పట్టుకుని హేయ్, నేను షూట్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లాను. అయితే అతను చనిపోయాడని నాకు తెలియదు. ఆ తర్వాత 3 గంటలకు కాల్ వచ్చి సంతోష్ చనిపోయాడని చెప్పారు. ఇప్పుడు కొడుక్కి దూరంగా ఇలా బతకలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది శాంతి విలియమ్స్.