యూట్యూబ్ స్టార్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్, దీప్తి సునైనా బిగ్ బాస్ లోకి వెళ్లి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ జంట ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు.. త్వరలోనే వీరి పెళ్లికి అన్నీ సిద్ధమనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక షన్ను బిగ్ బాస్ కి వెళ్లేముందు కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేహ్ సమయానికి దీప్తి- షన్నుకు బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయంపై షన్ను స్పందించాడు. ఇటీవల అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న షన్ను బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చాడు.
” దీప్తి నన్ను బ్లాక్ చేసిన విషయం నిజమే .. నా వలన తను చాలా సఫర్ అయ్యింది. ఎంతోమంది నా గురించి తనను ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ నిర్ణయం తీసుకొంది. ఈ గొడవలన్నీ సద్దుమణిగాక తనను కలిసి మాట్లాడతాను. బ్రేకప్ అనేది మా మధ్య ఉండదు.. నా చేతిపై ఈ టాటూ ఉన్నంతకాలం దీప్తిని వదిలేదే లేదు ” అని చెప్పుకొచ్చాడు. దీంతో షన్ను బ్రేకప్ కి రెడీగా లేదని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ జంట మళ్లీ ఒక్కటికావాలని అభిమానులు కోరుకొంటున్నారు.
