Site icon NTV Telugu

షన్ను- దీప్తి బ్రేకప్ .. కారణం ఆమెనా..?

shannu-deepthi

shannu-deepthi

బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ కి వెళ్లకముందే షణ్ముఖ్- దీప్తి సునయన తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి ప్లాన్ వేశారు. ఆ విషయాన్ని వారు అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే బిగ్ బాస్ ప్రభావం ద్వారా ప్రస్తుతం ఈ జంట మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల షన్ను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని దీప్తి డిలీట్ చేసింది. ఆ తరువాత అదంతా వేరని, దానికి వేరే కారణం ఉందని చెప్పుకోకోహ్హిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని పోస్ట్లు తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. వీటిని చూస్తుంటే వీరిద్దరిమద్య బ్రేకప్ అయినట్లు ఉందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

ఆమె పోస్టుల్లో విరహ బాధ తెలుస్తోందని అంటున్నారు. “ఈ సంవంత్సరం నాకు ఏమి బాలేదు.. అయినా నేను చాల నేర్చుకున్నాను”.. ‘కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు’.. ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో రాసుకొచ్చింది. ఇక వీటిని చుసిన నెటిజన్స్ ఖచ్చితంగా వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందని ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ లో షన్ను, సిరి లు క్లోజ్ గా ఉండడమే ఈ బ్రేకప్ కి కారణమని అంటున్నారు. మేమిద్దరం స్నేహితులమే అని అంటున్నా వారి మితిమీరిన చేష్టలు ఆ స్నేహం విలువ పోయేలా చేసిందని మరికొందరు చెప్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే షన్ను నోరు విప్పాల్సిందే.

Exit mobile version