Ram Charan: ఆ శంకర్ తో ఇలా ఇరుక్కుపోయావ్ ఏంటి అన్న… ఇండియన్ 2 అయిపోయి 3 అంటున్నాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. శంకర్ మేకింగ్ అండ్ సోషల్ కాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక్క సినిమాలో చరణ్ నటిస్తే ఇప్పుడు చరణ్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుందని మెగా ఫ్యాన్స్ కూడా భావించారు. అభిమానులు ఆశించినట్లే శంకర్, చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ని సెట్ చేసాడు. షూటింగ్ ఎక్కడ జరిగినా లీకులు బయటకి వచ్చి గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఇక్కడివరకు అంతబాగానే ఉంది కానీ అసలు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఒక్క పోస్టర్ తప్ప గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు, సాంగ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు కానీ అది కూడా అవ్వలేదు.
నత్త నడకన గేమ్ ఛేంజర్ షూటింగ్ జరగడానికి కారణం శంకర్ ఇండియన్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడడమే. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న శంకర్ గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ని డిలే చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయిందిలే ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ లో శంకర్ స్పీడ్ పెంచుతాడు అనుకుంటే… మెగా అభిమానులందరికీ షాక్ ఇస్తూ ఇండియన్ 3 వర్క్స్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడట శంకర్. ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3 సినిమాల షూటింగ్ ఒకేసారి చేయాలి అనేది శంకర్ ప్లాన్… అందుకే తగ్గట్లుగానే ప్రణాలిక సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇండియన్ 3 ప్యాచ్ వర్క్ ఉండడంతో కమల్, ఇండియన్ 3 కోసం జనవరి నెల లాస్ట్ నుంచి 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ముప్పై రోజులు ఇండియన్ 3 షూటింగ్ చేయడంలో శంకర్ బిజీ అయితే గేమ్ ఛేంజర్ సినిమాకి గుమ్మడి కాయ కొట్టే పని మరింత డిలే అయ్యే అవకాశం ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం స్పెండ్ చేసినంత టైమ్ లో చరణ్ ఇంకో రెండు సినిమాలు చేసి ఉండేవాడేమో.
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!