NTV Telugu Site icon

Ram Charan: ఆ శంకర్ తో ఇలా ఇరుక్కుపోయావ్ ఏంటి అన్న… ఇండియన్ 2 అయిపోయి 3 అంటున్నాడు?

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. శంకర్ మేకింగ్ అండ్ సోషల్ కాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక్క సినిమాలో చరణ్ నటిస్తే ఇప్పుడు చరణ్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుందని మెగా ఫ్యాన్స్ కూడా భావించారు. అభిమానులు ఆశించినట్లే శంకర్, చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ని సెట్ చేసాడు. షూటింగ్ ఎక్కడ జరిగినా లీకులు బయటకి వచ్చి గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఇక్కడివరకు అంతబాగానే ఉంది కానీ అసలు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఒక్క పోస్టర్ తప్ప గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు, సాంగ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు కానీ అది కూడా అవ్వలేదు.

నత్త నడకన గేమ్ ఛేంజర్ షూటింగ్ జరగడానికి కారణం శంకర్ ఇండియన్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడడమే. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న శంకర్ గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ని డిలే చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయిందిలే ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ లో శంకర్ స్పీడ్ పెంచుతాడు అనుకుంటే… మెగా అభిమానులందరికీ షాక్ ఇస్తూ ఇండియన్ 3 వర్క్స్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడట శంకర్. ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3 సినిమాల షూటింగ్ ఒకేసారి చేయాలి అనేది శంకర్ ప్లాన్… అందుకే తగ్గట్లుగానే  ప్రణాలిక సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇండియన్ 3 ప్యాచ్ వర్క్ ఉండడంతో కమల్, ఇండియన్ 3 కోసం జనవరి నెల లాస్ట్ నుంచి 30 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ముప్పై రోజులు ఇండియన్ 3 షూటింగ్ చేయడంలో శంకర్ బిజీ అయితే గేమ్ ఛేంజర్ సినిమాకి గుమ్మడి కాయ కొట్టే పని మరింత డిలే అయ్యే అవకాశం ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం స్పెండ్ చేసినంత టైమ్ లో చరణ్ ఇంకో రెండు సినిమాలు చేసి ఉండేవాడేమో.

Show comments