Site icon NTV Telugu

Shankar: పార్ట్ 3… శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే?

Shankar

Shankar

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. రోబో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మాస్టర్ మైండ్.. ఆ తర్వాత సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత 1996లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమా సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా మధ్యలోనే అటకెక్కింది. దాంతో దిల్ రాజు నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా స్టార్ట్ చేశాడు శంకర్ కానీ ఊహించని విధంగా ఈ సినిమా మధ్యలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేసింది ఇండియన్ 2. దాంతో ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్‌ను డీల్ చేస్తున్న డైరెక్టర్‌గా శంకర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో గేమ్ చేంజర్, ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత శంకర్ ఏం చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. తాజాగా.. ఇండియన్ 3 కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇండియన్ 2కి కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. ముందుగా ఇండియన్ 2 ఒక్కటే అని అనుకున్నా… ఈ సినిమా మొత్తం ఫుటేజ్ 6 గంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా, ఎంత ఎడిట్ చేసినా ఇంత రన్‌ టైంతో ఒక సినిమాను రిలీజ్ చేయడం కష్టం. అందుకే దీన్ని రెండు భాగాలుగా చేయడానికి రెడీ అవుతున్నారట. ఇండియన్ 3కి లీడ్ ఇస్తూ ఇండియన్ 2 క్లైమాక్స్‌ని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇండియన్ 2 ఫుటేజ్‌లో 75 శాతం పార్ట్‌ 3కి రెడీగా ఉందట. కాబట్టి మిగతా షూట్‌ని కూడా కంప్లీ చేసి వచ్చే ఏడాది చివర్లోనే ఇండియన్ 3ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట శంకర్. అయితే.. అలా జరగాలి అంటే, ముందు ఇండియన్ 2 వండర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇండియన్ 3 రానుందని చెప్పొచ్చు.

Exit mobile version