Ram Charan: 100 మంది కాదు షేర్‌ఖాన్.. ఈసారి 1000 మందితో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగధీర సినిమా క్లైమాక్స్‌ను అంత ఈజీగా మరిచిపోలేం. సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో ఎత్తు. రాజమౌళి యాక్షన్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు.. అని చరణ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా వంద మందిని చంపిన వీరుడిగా, మగధీరుడిగా అదరగొట్టేశాడు రామ్ చరణ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట మెగా పవర్ స్టార్. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఆర్సీ 15ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు.. రీసెంట్‌గానే గ్లోబల్ రేంజ్‌లో ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇంకా కొన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. రేపో, మాపో ఓ భారీ షెడ్యూల్‌ని షూట్ చేయబోతున్నారు.
ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ షూట్ చేయబోతున్నారు. ఇక ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా వెయ్యి నుంచి 1200 మంది ఫైటర్స్‌ని రంగంలోకి దింపుతున్నాడట శంకర్. దీనికి కేజియఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ‘అన్బు అరివ్’ బ్రదర్స్ పని చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ఫైట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా సిద్ధం చేశారు. ఈ ఫైట్‌లో రామ్ చరణ్‌తో పాటు విలన్‌గా నటిస్తున్న ఎస్‌జే సూర్య కూడా జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. మగధీర సినిమాలో వంద మందితో ఫైట్ అంటేనే.. థియేటర్ టాపులు లేచిపోయాయి. అలాంటిది వెయ్యి మందితో చరణ్ ఫైట్ అంటే.. ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి వెయ్యి మందితో గేమ్ ఛేంజర్ ఎలాంటి ఫైట్ చేస్తాడో చూడాలి.
Also Read
- PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
- Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
తాజావార్తలు
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!