‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది షాలిని పాండే. ప్రీతిగా అమ్మడి నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తరువాత షాలిని అవకాశాలు అయితే దక్కుతున్నాయి కానీ విజయాలు మాత్రం అందం లేదు.. ఇక ఇటీవల బొద్దుగా ఉన్న అమ్మడు సన్నజాజి తీగలా మారిపోయి అందాల విందు చేస్తున్న సంగతి తెలిసిందే.
హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మీద విరుచుకు పడుతున్న ఈ భామ తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. అద్దం ముందు కూర్చొని బ్లాక్ డాట్స్ స్లీవ్ లెస్ టాప్ లో కిల్లింగ్ లుక్స్ తో అదరగొట్టేసింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నటు షాలిని కొద్దిగా చిక్కినా అందంగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అమ్మడు కోలీవుడ్ , బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది. మరి ఏమండీ అందానికి ఫిదా అయ్యి టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తారో చూడాలి.