NTV Telugu Site icon

Shaitan Trailer: ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో

Saithan

Saithan

Shaitan Trailer: కరోనా (Corona) సమయంలో ప్రేక్షకులు ఓటిటీకి ఎంత అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడ వరకు వచ్చిందంటే.. ఇప్పుడు థియేటర్ లో సినిమాలు చూడడం మానేసి.. ఎప్పుడెప్పుడు ఓటిటీ (Ott)లోకి సినిమా వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆసక్తే మాకు బలం అని డైరెక్టర్లు, స్టార్లు సైతం ఓటిటీ వైపే దదృష్టి పెడుతున్నారు. సినిమాల్లో ఉన్నట్లు ఓటిటీకి సెన్సార్(Sensor) ఉండదు. ఈ మధ్యనే బాలీవుడ్ లో రానానాయుడు(Rana Naidu) సిరీస్ రిలీజ్ అయ్యి.. ఎన్ని వివాదాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది బాలీవుడ్(Bollywood) లో సహజమే అని చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు అదే సంస్కృతి తెలుగువారికి కూడా వచ్చేసింది. తాజాగా తెలుగు డైరెక్టర్ మహీ వి. రాఘవ( Mahi V Raghava) దర్శకత్వంలో వచ్చిన సైతాన్( Saithan) ట్రైలర్ చూస్తే.. జుగుప్స కలగడం ఖాయమని అంటున్నారు అభిమానులు.

Mahesh : రాజమౌళి సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న మహేష్..!!

డైరెక్టర్ మహీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. విలేజ్ లో వినాయకుడు(vilage Lo Vinayakudu), ఆనందో బ్రహ్మ(Anando Brahma), యాత్ర(Yathra) లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అతను.. ఈ మధ్యనే సేవ్ ది టైగర్స్ అనే కామెడీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ మంచి ప్రజాదరణ పొందింది. అలాంటి సిరీస్ తరువాత అతని దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ సైతాన్. రిషి, షెల్లీ, దేవయాని, రవి ప్రధాన పాత్రల్లో మహీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైతాన్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney Plus Hotstar) లో జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొదటి పోస్టర్ తోనే అందరి చూపు ఈ సిరీస్ పై వచ్చేలా చేశాడు డైరెక్టర్. రక్తపాతానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఒక పోలీస్ ను అతి దారుణంగా చంపి .. వేడుక చూస్తున్నట్లు కూర్చున్నారు నలుగురు. ఆ పోస్టర్ తోనే సిరీస్ పై అంచనాలను పెంచేశారు. ఇక తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ చూశాక .. ఏం ట్రైలర్ రా బాబు అంటూ ప్రేక్షకులు నెత్తి కొట్టుకుంటున్నారు. అంత దారుణంగా.. జుగుప్సాకరంగా ఉంది.

Gufi Paintal: ‘మహాభారత్’ నటుడు ఇకలేరు

ట్రైలర్ మొత్తం రక్తం, బూతులు, తలలు.. హా.. చూస్తూనే యాక్ అనేంతలా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు అర్ధం పర్థం లేని సీన్స్.. నరుక్కోవడం .. తలలు చూపించడం.. అస్సలు మగవారు కూడా వినలేని బూతులతో ట్రైలర్ ను నింపేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా డైరెక్టర్ ను అభిమానులు ఏకిపారేస్తున్నారు. ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో అని కొందరు అంటుండగా.. ఇంత వైలెన్స్.. ఇన్ని బూతులు.. కుటుంబంతో కలిసి ఎలా చూడగలరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరి ఈ సిరీస్ రిలీజ్ అవుతుందా..? లేకపోతే ఆపేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

Show comments