Site icon NTV Telugu

Shah Rukh Khan : 8 ప్యాక్ తో ఇంటర్నెట్ కి మంట పెట్టేసిన కింగ్ ఖాన్

Sharukh

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తాజా పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. షర్ట్ లేకుండా 8 ప్యాక్ లుక్ తో దర్శనమిచ్చిన షారుక్ తన కిల్లర్ ఆబ్స్ తో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో కింగ్ ఖాన్ షేర్ చేసిన పిక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. షారుఖ్ తన తాజా చిత్రం కోసం జిమ్ లో కఠోరమైన శిక్షణ తీసుకుని ఎయిట్ ప్యాక్ ఆబ్స్‌ తో కన్పించాడు. ఈ పిక్ కు “షారూఖ్ అగర్ థోడా రుఖ్ భీ గయా తో పఠాన్ కో కైసే రోకోగే.. యాప్స్ ఔర్ అబ్స్ సబ్ బనా దలుంగా” అని పోస్ట్ చేశాడు. ఈ పిక్ ను బాలీవుడ్ బాద్షా షేర్ చేసిన వెంటనే ఆయన అభిమానులు లైకులు, కామెంట్స్ వర్షం కురిపించారు.

Read Also : Actor Vinayakan : మీటూపై అనుచిత వ్యాఖ్యలు… సిస్టర్ అంటూ సారీ చెప్పిన స్టార్

ఇక షారుఖ్ వెండి తెరపై కన్పించక చాలా కాలమే అవుతోంది. ఆయన చివరిసారిగా ‘జీరో’ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తరువాత బ్రేక్ తీసుకున్న షారుక్ ఇప్పుడు ‘పఠాన్’తో థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పై నిర్మిస్తున్నారు. 2023 జనవరి 25న ‘పఠాన్’ విడుదల కానుంది.

Exit mobile version