NTV Telugu Site icon

Shahrukh Khan: షారుఖ్ ఖాన్ ఆ విషయాలు తెలుసుకోవాలా!?

Shaurkh

Shaurkh

Shahrukh Khan:సినిమా రంగంలో ప్రముఖులైన స్టార్స్ తమ వారసులను డైరెక్ట్ చేసిన సందర్భాలు బోలెడు కనిపిస్తాయి. కానీ, స్టార్స్ అయిన తమ తండ్రులకు దర్శకత్వం వహించిన కుమారులు కొందరే తారసపడతారు. ఈ కోవలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రాజ్ కపూర్ అనే చెప్పాలి. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ ఒకప్పుడు పేరు మోసిన నటులు. ఆ రోజుల్లో ఆయన ఓ స్టార్ అనే చెప్పాలి. మూకీ సినిమాల నుండి తరువాత టాకీల్లోనూ తనదైన బాణీ పలికించారు పృథ్వీరాజ్. అంతటి మహానటుడైన తండ్రిని రాజ్ కపూర్ ‘ఆవారా’లో నటింప చేసి దర్శకత్వం వహించారు. అన్నట్టు ఆ సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ తండ్రి అంటే రాజ్ కపూర్ కు తాత అయిన బసేశ్వర్ నాథ్ కపూర్ కూడా ఓ సీన్ లో జడ్జిగా నటించారు. అంటే తండ్రిని, తాతను కూడా డైరెక్ట్ చేసిన ఘనత రాజ్ కపూర్ కు దక్కిందన్న మాట! ఇంతకూ ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన అవసరం ఏమిటంటారా? షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఓ లగ్జరీ యాడ్ కోసం తన తండ్రిని డైరెక్ట్ చేశాడు. ఆ వీడియోను షారుఖ్ విడుదల చేయగానే చాలామంది హాలీవుడ్ బాబులను గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి మన దేశంలోనే ఈ ఫీట్ చేసిన రాజ్ కపూర్ ను ఎవరూ స్మరించుకోక పోవడం గమనార్హం!

Boyapati Srinu: బోయపాటి శ్రీనుకు నిజంగా పరీక్షనే!

రాజ్ కపూర్ తరువాత ఆ ఫీట్ చేసిన వారు ఇంకా ఎవరున్నారు? ఆయన పెద్ద కొడుకు రణధీర్ కపూర్ ఉన్నారు. రణధీర్ కపూర్ ‘ఆజ్ కల్ ఔర్ కల్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో తాత పృథ్వీరాజ్ కపూర్ ను, తండ్రి రాజ్ కపూర్ ను నటింప చేశారు. అలా తండ్రీకొడుకులు రాజ్ కపూర్, రణధీర్ కపూర్ తమ నటవంశానికే చెందిన మూడు తరాల వారిని దర్శకత్వం వహించిన క్రెడిట్ సాధించారు. తన తనయుడు తనను డైరెక్ట్ చేయగానే మురిసిపోతున్న షారుఖ్ ఖాన్, మరి ఈ ఘనతలను గుర్తు చేసుకుని కొడుకు దర్శకత్వంలో ఓ ఫీచర్ ఫిలిమ్ లోనే నటిస్తారేమో చూడాలి.

Show comments