Site icon NTV Telugu

Shahrukh Khan: అట్లీ కోసం ‘జవాన్’ గా షారుక్ !

Jawan

Jawan

తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే! దాని పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దీనికి ‘జవాన్’ అనే పేరు ఖరారు చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఎస్.ఆర్.కె. ప్రెజంటర్ గా ఉన్నారు. ఈ మూవీ టైటిల్ కు ను ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. ఒళ్ళంతా గాయాలతో ఉన్న జవాన్.. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై శత్రువుల కోసం వేచి చూస్తుండే ఈ టీజర్ గూస్ బంబ్స్ కలిగిస్తోంది.

‘రాజారాణీ’ కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న అట్లీ ఆ తర్వాత ‘తేరి, మెర్సిల్, బిగిల్’ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అతని ట్రాక్ రికార్డ్ చూసి ఇంప్రస్ అయిన షారుక్ ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ అట్లీకి కల్పించాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ‘జవాన్’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే యేడాది జూన్ 2న విడుదల చేయబోతున్నారు. షారుక్ ఖాన్ సినిమాలను చూసి, ఆయన్ని అభిమానిస్తూ పెరిగిన తాను ఇవాళ అదే వ్యక్తిని డైరెక్ట్ చేయడం గౌరవంగా ఉందంటూ అట్లీ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

Exit mobile version