షారూఖ్ డిజిటల్ ఎంట్రి కన్ ఫామ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్
మారిన కాలానికి అనుగుణంగా మన తారలు కూడా మారుతున్నారు. బడా స్టార్స్ సైతం డిజిటల్ బాట పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ డిజిటల్ ఎంట్రీనే అందుకు తార్కాణం. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా పూర్తి చేసి అట్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న షారూఖ్ ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ డిజిటల్ ఎంట్రీకి సై అనేశాడు.
Also Read
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ నిర్మించబోయే వెబ్ సీరీస్ లో నటించటానికి పచ్చజెండా ఊపేశాడు. ఇదే విషయాన్ని డిస్నీ అధికారికంగా కూడ ప్రకటించింది. షారూఖ్ లాంటి సూపర్ స్టార్ త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ తమ కోసం వెబ్ సీరీస్ సైన్ చేశాడని గర్వంగా చెప్పుకుంటోంది. ఇక తెలుగునాట డిస్నీకి ప్రమోటర్ గా సూపర్ స్టార్ మహేశ్ వ్యవరిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ డీల్ లో మహేశ్ కి దాదాపు 3 కోట్లు ముట్టచెప్పనున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రచారానికి పరిమితమైన మహేశ్ డిజిటల్ ఎంట్రీకి సై అంటే కోట్లకు కోట్లు ఇవ్వటానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సిద్ధంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మహేశ్ సై అంటాడా? చూద్దాం అదెప్పుడు జరుగుతుందో.

తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?