SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRK Mannat: ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ దగ్గర సముద్రాన్ని చూస్తూ నిలిచే ‘మన్నత్’ పేరు వినగానే గుర్తొచ్చేది ఒక్కరే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అభిమానులకు ఇది కేవలం ఓ సెలబ్రిటీ ఇల్లు కాదు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి స్టార్‌గా ఎదిగిన షారుఖ్ ఖాన్ జీవిత ప్రయాణానికి, ఆయన కలలకు, కుటుంబంతో నిర్మించుకున్న సామ్రాజ్యానికి ఇది ఒక ప్రతీక. ప్రతిరోజూ వేలాది మంది అభిమానులు ఈ ఇంటి గేట్ల ముందు నిలబడి తమ అభిమాన నటుడి ఒక్క చూపు కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి మన్నత్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఇంటి రీఇన్నోవేషన్ కారణంగా ఆఆ మహల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. దీని వెనుక భాగంలో అదనంగా రెండు అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఆనంద్ పండిట్‌కు చెందిన శ్రీ లోటస్ డెవలపర్స్ మన్నత్ పునరుద్ధరణ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రీఇన్నోవేషన్ కు దాదాపు రూ.25 కోట్లు ఖర్చవుతుందని నివేదికలు చెబుతున్నాయి. నిర్మాణ పనుల కారణంగా ఇంట్లో ఉండటం ఇబ్బందిగా మారడంతో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, వారి పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్ తాత్కాలికంగా బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న పూజా కాసా లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లకు మారినట్లు సమాచారం. ఇది నిర్మాత వాషు భగ్నానీకి చెందినదిగా తెలుస్తోంది.
Also Read
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
అయితే నేడు కోట్ల విలువ చేసే మన్నత్ అసలు కథ 1997లో మొదలైంది. అప్పట్లో షారుఖ్ ఖాన్ ‘యెస్ బాస్’ సినిమా షూటింగ్లో ఉన్నారు. సినిమాలోని ‘చాంద్ తారే’ పాటలోని కొన్ని సన్నివేశాలను అప్పట్లో ‘విల్లా వియన్నా’గా పిలిచే ఈ భవనం బయట చిత్రీకరిస్తుండగా, షూటింగ్ బృందాన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాచ్‌మన్ కోరినట్లు కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ గతంలో గుర్తుచేశారు. దాంతో షారుఖ్ సరదాగా ఈ ఇల్లు కొనేస్తే ఇక్కడే షూటింగ్ చేసుకోవచ్చేమో అని అన్నారట. ఆ సమయంలో అది సరదా మాటే. కానీ అదే మాట నాలుగేళ్ల తర్వాత నిజమైంది.
ఆ సమయంలో షారుఖ్, గౌరీ ఖాన్లు దర్శకుడు అజీజ్ మీర్జాకు చెందిన ‘దేవదూత్’ అనే ఇంట్లో నివసించేవారు. మన్నత్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లేవారని అజీజ్ మీర్జా గతంలో చెప్పారు. ఆ రోజుల్లోనే షారుఖ్ ఈ ఇంటిని ఎప్పటికైనా సొంతం చేసుకోవాలని కలలు కని ఉండొచ్చని ఆయన గుర్తుచేసుకున్నారు. చివరకు 2001లో ఆ కల నెరవేరింది. నివేదికలను బట్టి ఈ ఆస్తిని షారుఖ్ సుమారు రూ.13 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇల్లు కొనడం ఒక పెద్ద సవాలు అయితే, దాన్ని తన కలల ఇంటిగా మార్చడం మరో పెద్ద పరీక్షగా మారింది. అప్పట్లో షారుఖ్ దగ్గర ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించేందుకు అవసరమైనంత డబ్బు లేదట. 2023లో గౌరీ ఖాన్ రచించిన ‘My Life in Design’ పుస్తకావిష్కరణ సందర్భంగా షారుఖ్ ఈ విషయాన్ని స్వయంగా గుర్తుచేసుకున్నారు. ఇంటిని కొనడమే తమ స్థోమతకు మించిన పని అని, ఆ తర్వాత అది శిథిలావస్థలో ఉండటంతో పునరుద్ధరణకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
ఇంటీరియర్ డిజైనర్‌ను నియమించుకునే పరిస్థితి లేకపోవడంతో చివరకు గౌరీ ఖాన్నే ఇంటిని డిజైన్ చేయమని షారుఖ్ ప్రోత్సహించారు. గౌరీలో ఉన్న కళాత్మక ప్రతిభను గుర్తించి ఆమెను డిజైన్ వైపు మళ్లించిన ఈ నిర్ణయం తర్వాత ఆమె కెరీర్లోనే కీలక మలుపుగా మారింది. మన్నత్‌ను తీర్చిదిద్దే క్రమంలో ప్రారంభమైన ఆసక్తి తర్వాత గౌరీ ఖాన్‌ను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్‌గా నిలబెట్టింది.
ఒకప్పుడు ఇంటిని అలంకరించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఎలా ఉండేదో షారుఖ్ చెప్పిన మరో సంఘటన మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటి డిజైన్ గురించి చర్చించేందుకు వచ్చిన ఓ డిజైనర్‌కు వడ్డించిన భోజనం ఖర్చే అప్పట్లో తన సంపాదన కంటే ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇంటి కోసం వస్తువులు కొనేవాళ్లమని, దక్షిణాఫ్రికాలో సోఫా కోసం లెదర్ కొనుగోలు చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో విదేశాలకు తీసుకెళ్లేందుకు అనుమతించే పరిమితమైన డబ్బును కూడా ఇంటి అలంకరణ కోసమే ఉపయోగించేవాళ్లమని తెలిపారు.
విల్లా వియన్నాగా మొదలై మన్నత్‌గా మారిన ఈ భవనం నేడు ముంబైలోని అత్యంత గుర్తింపు పొందిన సెలబ్రిటీ ఆస్తుల్లో ఒకటిగా నిలిచింది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే రెండు దశాబ్దాల్లో షారుఖ్ కొనుగోలు చేసిన ఆస్తి విలువ భారీగా పెరిగింది. ఒకప్పుడు షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొని ఇప్పుడు అదే ఇంటిని మరింత విస్తరిస్తూ తన ఫ్యామిలీ అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు కింగ్ ఖాన్. అందుకే మన్నత్ ఒక భవనం కాదు.. షారుఖ్ ఖాన్ చూసిన కలకు, దాన్ని సాధించిన పట్టుదలకు, ఆ కలను కుటుంబ వారసత్వంగా మార్చుకున్న ప్రయాణానికి నిలువెత్తు గుర్తు. ఇక నటుడిగా కూడా షారుఖ్ ఖాన్ జోరు మీదే ఉన్నారు. ఆయన నెక్స్ట్ మూవీ ‘కింగ్’ 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.
- Tags
- cinema
- SRK Mannat
తాజావార్తలు
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..