Site icon NTV Telugu

Jawan: మెంటలెక్కిస్తున్న జవాన్ క్రేజ్.. ట్రైల‌ర్ రిలీజ్ కాకుండానే అన్ని కోట్లా?

Sharukh Khan Jawan Non Theatrial Rights

Sharukh Khan Jawan Non Theatrial Rights

Jawan’s Non Theatrical Rights: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జవాన్’ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రదర్శించబోయే థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసిందని సినిమా యూనిట్ ప్రకటించింది. అదేమంటే ఇంకా ఈ సినిమా ట్రైల‌ర్ కూడా ఇంకా రిలీజ్ కాక‌ముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావడం విశేషం. ఇక మరోపక్క సూపర్ యాక్ష‌న్ ఎలిమెంట్స్, న‌టీన‌టుల అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన జ‌వాన్ ట్రైల‌ర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Dimple Hayathi: ఫ్రంటు, బ్యాక్ చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగమ్మాయి డింపుల్ హయతి

సాధార‌ణంగానే షారూక్ ఖాన్ సినిమాల‌కు సంబంధించిన హ‌క్కులన్నీ ఫ్యాన్సీ రేట్ల‌కే అమ్ముడ‌వుతుంటాయి కానీ ఆయ‌న గ‌త సినిమాల రికార్డుల‌ను ఆయ‌న తాజా చిత్రాలు దాటేస్తున్నాని అనడంలో ఎలాంటి సందేహము లేదు. షారూక్ ఖాన్ గ‌త చిత్రం ప‌ఠాన్ బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది దీంతో ఇక ఇప్పుడు జ‌వాన్‌పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆ క్రమంలోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం అంద‌రూ పోటీ ప‌డుతున్నారు. ఇక నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు హాట్ కేకులా అమ్ముడ‌వటం చూస్తుంటే షారూక్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ ఎంట‌నేది స్ప‌ష్ట‌మైందని అంటున్నారు. షారూక్ ఖాన్ హీరోగా డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్, గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version