NTV Telugu Site icon

Jawan Preview: మార్కెట్లో మెంటల్ ఎక్కిస్తున్న ‘జవాన్’ ప్రివ్యూ

Jawan

Jawan

Shah Rukh Khan’s Jawan Movie Preview: పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో షారుఖ్ సినిమా అంటే పిచ్చ క్రేజ్ ఉండేది, అయితే దానికి మించిన క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది డైరెక్టర్ అట్లీ డైరెక్టర్ గా, నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించడమే. ఇక ఇన్నాళ్ల నిరీక్షణకు ఇక కౌంట్ డౌన్ మొదలైంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది, ఇప్పటికే నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్లు ప్రీ బుక్ అయిపోయాయని అంచనా. నార్త్ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ హడావిడి చూస్తుంటే సినిమా కచ్చితంగా ఓ రేంజ్‌లో హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Mahesh Babu: మహేష్ బాబు మంచి మనసు.. మరో చిన్నారికి ప్రాణదానం

ఇక హైదరాబాద్ సరే ఎప్పుడూ ఉండేదే కానీ ఈసారి ఏపీలోని సిటీలు, టౌన్స్ లో కూడా ఈ సినిమాకి మాంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఢిల్లీలో ఏర్పాటు చేసిన జీ 20 సమ్మిట్ దేశ రాజధానిలో జవాన్ పై భారీ ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తోంది. నిజానికి సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ 20 సమ్మిట్ ఢిల్లీ లో జరగనుంది, ఈ క్రమంలో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దేశ రాజధానిలో పలు ఆంక్షలను విధించనున్నారు అధికారులు. ఆ మూడురోజుల పాటు పలు రోడ్లను మూసివేసి మెట్రో రైళ్ల రాకపోకలు కూడా నిలిపివేయనున్నారు. వరుసగా మూడురోజులు స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకి సెలవులు అంటే సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగడం ఖాయమే కానీ ఇన్నీ ట్రాఫిక్ ఆంక్షలు, రైళ్ల నిలిపివేత మధ్య ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారా అనేది పెద్ద ప్రశ్న.

ఢిల్లీ సంగతి పక్కనపెడితే మొత్తానికి సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ సందడి మొదలు కానుంది. నిజానికి సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా మొదటి రోజే 40 కోట్ల ఓపెనింగ్ రాబట్టి షారుఖ్-సల్మాన్ లాంటి స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేసింది. ఇక పఠాన్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయేమో అనేలా వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న సమయంలో పఠాన్ రికార్డ్స్ ని కాపాడుకోవడానికి షారుక్ ఖాన్ మళ్ళీ జవాన్ గా బరిలోకి దిగుతున్నాడు. చూడాలి ఈ సినిమాతో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డులు బద్దలు కొడతాడు అనేది.