Site icon NTV Telugu

Allu Arjun: కొడుకు పాటకు షారుఖ్ ఫిదా.. అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే అభిమానులను మనసులను కొల్లగొట్టింది. ఇక అయాన్ తన చిలిపి పనులతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ మధ్య అల్లు అయాన్ చేసేది అల్లరి పనులు ట్రోల్ చేస్తూ.. మీమర్స్ నవ్వులు కురిపిస్తున్నారు. అంతేనా అయాన్ ను మోడల్ గా మార్చేశారు. ఇక కొడుకు చేసే అల్లరి పనులను అల్లు అర్జున్ కూడా ఒప్పేసుకుంటూ.. నా కొడుకు మోడల్ అంటూ అధికారికంగా చెప్పుకొచ్చేసాడు. ఇంకేముంది అయాన్ అనగానే.. అందరూ మోడల్ బొల్తే అంటూ కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. ఇక తాజాగా అయాన్ తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టాడు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని లుట్ ఫుట్ గయా పాటను పాడాడు. కారులో వెళ్తుండగా.. చెల్లి అర్హ కాళ్ళను ఒడిలో పెట్టుకొని లుట్ ఫుట్ గయా అంటూ తనకు వచ్చిన లైన్స్ ను ఆలపించాడు. ఈ వీడియోను అల్లు స్నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోకు షారుఖ్ ఖాన్ సైతం ఫిదా అయిపోయాడు. సూపర్ అయాన్ అంటూ ఈ వీడియోను షేర్ చేస్తూ అయాన్ ను మెచ్చుకున్నాడు. ” థాంక్ యు లిల్ వన్… మీరు పువ్వు మరియు అగ్ని రెండూ ఒకదానిలో ఒకటిగా మారాయి.. ఇప్పుడు నా పిల్లలకు అల్లు అర్జున్ నటించిన శ్రీవల్లీ సాంగ్ ను పాడటం ప్రాక్టీస్ చేయిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక షారుఖ్ ట్వీట్ కు అల్లు అర్జున్ థాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version