NTV Telugu Site icon

Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం

Eshwari On Aishwarya

Eshwari On Aishwarya

Servant Eeshwari Blame Aishwarya Rajinikanth For Not Increasing Her Salary: సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరగడం, ఇంట్లో పని చేసే ఈశ్వరి అనే పనిమనిషే ఈ దొంగతనానికి పాల్పడటం, మార్చి 31వ తేదీన పోలీసులు ఆమెను పట్టుకోవడం.. అంతా తెలిసిందే! ఈశ్వరిని పట్టుకున్న అనంతరం ఈ దొంగతనం ఎందుకు చేశావని పోలీసులు విచారించగా.. దిమ్మతిరిగే వాంగ్మూలం ఇచ్చింది. ఐశ్వర్య చాలా పెద్ద పిసినారి అని, 18 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ జీతం పెంచడం లేదన్న కోపంతోనే ఈ దొంగతనానికి పాల్పడ్డానంటూ బాంబ్ పేల్చింది.

Gold Theft : నగలు చూస్తున్నట్లు నాటకం.. 15తులాల బంగారం చోరీ

పోలీసుల విచారణలో ఈశ్వరి మాట్లాడుతూ.. ‘‘నేను గత 18 ఏళ్లుగా ఐశ్వర్య ఇంట్లో పని చేస్తున్నాను. ఐశ్వర్య పిల్లల బాగోగులతో పాటు మరెన్నో పనులు చూసుకుంటున్నాను. వాళ్లు చెప్పిన ప్రతీ చిన్న పని చేస్తూనే వస్తున్నాను. అయినా సరే.. వాళ్లు నాకు నెలకు కేవలం రూ.30 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. వాళ్ల దగ్గర ఎంతో డబ్బున్నా.. నాకు మాత్రం జీతం పెంచలేదు. ఈ రూ.30 వేలతో నేను ఎలా బ్రతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? తమ అవసరాల కోసం ఎంతో ఖర్చు చేసుకుంటారు కానీ, ఇంట్లో వాళ్ల పనులన్నీ చేసి పెడుతున్న నాకు మాత్రం జీతం పెంచట్లేదు. జీతం తక్కువగా ఇస్తున్నారనే కోపంతోనే.. దొంగతనం చేశాను. ఒకవేళ నా పనికి తగ్గ మంచి జీతం ఇచ్చి ఉంటే, దొంగతనం ఎందుకు చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. మొదట తాను చిన్న చిన్న దొంగతనాలు చేసేదాన్నని, అప్పుడు దొరికిపోలేదని తెలిపింది. ఆ ధైర్యంతోనే ఈసారి నగలు దొంగలించానని కుండబద్దలు కొట్టింది.

CM KCR Live.. Emotional Speech : నాజీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశా

కాగా.. ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పనిమనిషి ఈశ్వరి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా.. 100 బంగారం ముక్కలు, 30 గ్రాముల డైమండ్ ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తులు లభ్యమయ్యాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. తన కంప్లైంట్‌లో ఐశ్వర్య ఇచ్చిన ఆభరణాల లిస్ట్‌లో కంటే, ఈశ్వరి ఇంట్లో ఎక్కువ నగలు దొరికాయి. వీటిని చూశాక.. గతంలో ఈశ్వరి చేసిన చిన్న చిన్న దొంగతనాల బాగోతం కూడా బయటపడింది. అంతేకాదు.. ఈశ్వరికి చెన్నైలోని షోలింగనల్లూరు ప్రాంతంలో రూ.1 కోటి విలువ చేసే ఇల్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Show comments