Adipurush : క్రేజీ బజ్… జక్కన్న బాటలో ఓం రౌత్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ కూడా జక్కన్న బాటనే ఎంచుకున్నాడు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘బాహుబలి’తో దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన సీక్వెల్ ట్రెండ్ మామూలుది కాదు. ఇప్పుడు Adipurushకు కూడా సీక్వెల్ రానుందనేది తాజా న్యూస్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ప్రేరణతో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, కృతి సనన్ సీతగా కనిపించనుంది. ఈ పీరియాడిక్ ఫిల్మ్‌లో సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడి పాత్రలో నటించారు. టి సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం VFX పనులు శరవేగంగా జరుగుతుండగా, 2023 జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Read Also : KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
Also Read
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
అయితే త్వరలో ‘ఆదిపురుష్’ సీక్వెల్ ఉంటుందనే ఇప్పుడు బజ్ నడుస్తోంది. Adipurush దర్శకుడు ఓం రౌత్ సీక్వెల్ ఆలోచనలో ఉండగా, ప్రభాస్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్న టీం త్వరలోనే కమర్షియల్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని టాక్. ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే వచ్చే ఏడాది ‘ఆదిపురుష్’ సీక్వెల్ కోసం ప్రభాస్ డేట్స్ కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిటింగ్ తప్పదు ! మరోవైపు ప్రభాస్ త్వరలో ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!