Site icon NTV Telugu

Liger: సీక్వెల్ ఖాయం! అనన్య పాత్రపై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ!

Liger Seque

Liger Seque

‘లైగర్’ మూవీ రిలీజ్ కు ముందే దాని సీక్వెల్ పై మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ‘లైగర్’ లాంటి కథలకు సీక్వెల్స్ సహజంగానే ఉంటాయని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఛార్మి ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ఫాన్స్ తో పాటు జనరల్ పబ్లిక్ కు ఈ మూవీపై ఉన్న అంచనాలను, సందేహాలను వారి తరఫున ఛార్మి నిర్మొహమాటంగా ఆ ఇద్దరీ అడిగేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉంటే… ‘లైగర్’ మూవీకి సీక్వెల్ తప్పని సరిగా ఉంటుందని విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో తెలిపాడు. పూరి సీక్వెల్ కథను రెడీ చేస్తున్నారని చెప్పాడు. ఆ విషయం తెలిసిన అనన్య పాండే తాను సీక్వెల్ లో ఉంటానా లేదా అనే సందేహాన్ని తన దగ్గర వ్యక్తం చేసిందని విజయ్ అన్నాడు. ఇదే సమయంలో పూరి జగన్నాథ్ అనన్య పాండే గురించి చెబుతూ, ‘2020లో మూవీ విడుదలైనప్పటికీ ఇప్పటికీ అనన్యలో చాలా ఛేంజ్ చూశానని, పెరుగుతున్న పిల్లలు కావడంతో మూడు నెలలకే ఛేంజ్ అవుతుంటార’ని తెలిపాడు. అంతే కాదు… అదే విషయాన్ని తాను అనన్యతో చెప్పానని, యేడాది తర్వాత తిరిగి మనమిద్దరం కలిసి పనిచేద్దామని అన్నానని పూరి చెప్పాడు. ‘లైగర్ -2’ చేయాల్సి ఉంటుందని కరన్ జోహార్ మొదట తనతో అన్నాడని పూరి తెలిపాడు. సో… ‘లైగర్’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడితే… దాని సీక్వెల్ తీయడం ఖాయం. అందులోనూ అనన్య పాండే నటించే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. బట్… ఈ మధ్యలో విజయ్ దేవరకొండ, పూరి కలిసి ‘జనగణమన’ చిత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద కూడా ‘లైగర్’ సీక్వెల్ ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు!!

ఇక ‘లైగర్’ మూవీ హిందీ వర్షన్ పెయిడ్ షోస్ ను గురువారం రాత్రి వేస్తారని, రెగ్యులర్ షోస్ ను శుక్రవారం నుండి ప్రారంభిస్తారని తెలుస్తోంది. తెలుగులో మాత్రం ముందు అనుకున్నట్టు ఈ సినిమా గురువారం విడుదల కాబోతోంది. సోషల్ మీడియాలో సైతం ‘ఐ సపోర్ట్ లైగర్’, ‘అన్ స్టాపబుల్ లైగర్’ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ ట్రెండింగ్ లో అగ్రస్థానంలో నిలిచాయి.

Exit mobile version