NTV Telugu Site icon

KP Chowdary Case: కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచనాలు.. మళ్ళీ తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు!

Kp Chowdary Case

Kp Chowdary Case

KP Chowdary Custody Report: టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో కీలక అంశాలను రాబట్టారు పోలీసులు. కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి లిస్ట్ బట్ట బయలు అయింది. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అతని నుంచి పెద్దగా వివరాలు రాబట్టలేక పోయారు. పోలీసుల విచారణలో కొద్ది మంది వివరాలు మాత్రమే కేపి వెల్లడించినట్టు చెబుతున్నారు. ఈ కేపీ చౌదరి లిస్టులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నాయని పోలీసులు తేల్చారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఒక హీరోయిన్, తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన మరో హీరోయిన్లకు కేపీ డ్రగ్స్ అమ్మాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరితో కేపీ 100ల సంఖ్యలో కాల్స్ మాట్లాడాడు.
Sukma: క్యాంప్ పై మావోయిస్టుల దాడి..పరుగులు పెట్టించిన పోలీసులు!
ఆ కాల్స్ ఏమిటి అని అడిగితే మాత్రం కేపీ నోరు మెదప లేదని సమాచారం. ఇక పోలీసుల ముందు 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్టు ఒప్పుకున్నాడు కేపీ, ఆ 12 మందిలో పలువురు బడా బాబులు, పలువురు యువతులు ఉన్నారని తేలింది. ఇక ఈ క్రమంలో కేపీ బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించిన పోలీసులు, అతని ఖాతాలో 11 అనుమానస్పద లావాదేవీలను కూడా గుర్తించారు. కేపీ లిస్ట్ లో డ్రగ్ కన్స్యూమర్స్ ఈ మేరకు ఉన్నారు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్. ఇక నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలతో పాటు సెలబ్రిటీలు, నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ అమ్మినట్టు తేల్చారు. తెలుగులో పాపులారిటీ దక్కించుకున్న అషురెడ్డి సహా మరో ఆర్టిస్టుతో వందల కాల్స్‌ మాట్లాడిన కేపీ చౌదరీ పోలీసులకే షాకింగ్ గా మారాడు. కేపీ చౌదరీ కాల్‌ లిస్ట్‌ను డీకోడ్‌ చేస్తున్న పోలీసులు కేపీ చౌదరీ ఫోన్‌ సంభాషణలపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేపీ చౌదరి వ్యవహారం చూస్తుంటే త్వరలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెర మీదకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Show comments