మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహా .. ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ .. ‘అరవింద సమేత’లో దేవయాని .. ‘అల వైకుంఠపురంలో’ టబు కీలకమైన పాత్రల్లో కనిపించారు. ఇక తాజగా త్రివిక్రమ్, మహేష్ బాబు తో కలిసి ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.
ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి లో షూటింగ్ ని స్టార్ట్ చేయనుంది. ఇక ఈ సినిమాలో మహేష్ పిన్ని పాత్ర చాలా కీలకమంట.. ఈ పాత్ర చుట్టే సినిమా మొత్తం నడవనున్నదట. అందుకే ఈ పాత్రకోసం సీనియర్ హీరోయిన్ శోభనను త్రివిక్రమ్ రంగంలోకి దింపుతున్నాడట. ఇప్పటికే ఆమెతో మేకర్స్ చర్చలు జరిపారని, ఆమెకూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. తెలుగు సినిమాలకి దూరమైనా శోభన ప్రస్తుతం తమిళ్ , మలయాళ సినిమాలో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ కి తెలుగులో కూడా మరోసారి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచిచూడాల్సిందే
