NTV Telugu Site icon

Sudhakar: నేను బ్రతికే ఉన్నాను… దయచేసి వాటిని నమ్మొద్దు

Sudhakar

Sudhakar

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయ్యాక ఏ వార్తని నమ్మాలో ఏ వార్తని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సగానికి పైగా రూమర్స్ మాత్రమే ఉన్నాయి, ఇక సినిమా వాళ్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ స్టార్స్ గురించి అయితే వాళ్లు డేటింగ్ లో ఉన్నారు, వీళ్లు రిలేషన్ లో ఉన్నారు అని రాస్తారు. ఒకవేళ కాస్త ఏజ్డ్ ఆర్టిస్టుల గురించి అయితే వారు కష్టాల్లో ఉన్నారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అని రాస్తారు. అనారోగ్యం అయినా కాస్త బెటర్, కొంతమంది గురించి అయితే ఏకంగా మరణించారు అని రాయడం కూడా సోషల్ మీడియాలో మనం తరచుగా చూస్తే ఉండేదే. కోట శ్రీనివాస్ రావు లాంటి లెజెండరీ యాక్టర్ తనపై వస్తున్న రూమర్స్ విని, నేను బ్రతికే ఉన్నాను అని ఉగాది పండగ రోజు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఈ రూమర్స్ ఎంతగా స్ప్రెడ్ అవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా ఇలాంటి రూమర్స్ ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి వైరల్ అవుతున్నాయి.

సినిమాలకి దూరంగా ఉన్న సుధాకర్ మరణించాడు అనే వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో… “అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవన్నీ అసత్య వార్తలే. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ” అంటూ సుధాకర్ వీడియో రిలీజ్ చేసాడు. సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి ఫేక్‌ రూమర్స్ వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2010లో సుధాకర్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడి కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ మరణించారనే వార్త తెగ వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుండటంతో సుధాకర్ స్వయంగా వీడియో రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పటికైనా సుధాకర్ మరణించాడు అనే ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి. వీడియోలో సుధాకర్ బాగా తగ్గిపోయి, ఒకప్పటి కల పూర్తిగా పోయి కనిపించాడు. ఆడియన్స్ ని విపరీతంగా నవ్వించిన ఒక ఆర్టిస్ట్ ని అలా చూడడం ఎవరినైనా బాధించే విషయమే.