Site icon NTV Telugu

స్ట్రాంగ్ మ‌ద‌ర్ గా సుహాసిని ‘మళ్ళీ మొదలైంది’!

Senior Actress Suhasini as an Inspiring Mother in Malli Modalaindi

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సుమంత్ పెళ్ళి శుభలేఖతో ‘మళ్ళీ మొదలైంది’ సినిమాపై అందరి దృష్టి పడింది. సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్‌స్పిరేష‌నల్ రోల్‌లో సీనియ‌ర్ న‌టి సుహాసిన మ‌ణిర‌త్నం న‌టిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర‌ర్‌, ధైర్య‌, సాహ‌స‌వంతమైన సింగిల్ మ‌ద‌ర్ ‘సుజా’ పాత్ర‌లో ఈమె క‌నిపిస్తున్నారు.

Read Also : ‘పొన్నియన్ సెల్వన్’ కోసం హైద్రాబాద్ లో ఐష్ ఆటా, పాటా

శుక్ర‌వారం సుహాసిని పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఉండే ల‌వ్ అండ్ ఎమోష‌న్స్‌తో పాటు భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని దర్శక నిర్మాతలు తెలిపారు. సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version