NTV Telugu Site icon

Aishwarya: డబ్బులు కావాలి .. పాచి పని అయినా చేస్తా.. సీనియర్ హీరోయిన్ ఆవేదన

Lakshmi

Lakshmi

సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో బామ్మ పాత్రలు చేసి మెప్పిస్తుంది. ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. ఇక ఆమె కూతురు ఐశ్వర్య లక్ష్మీ కూడా తెలుగువారికి సుపరిచితమే. కల్యాణ వైభోగమే, ఓ బేబీ చిత్రాల్లో నాగ శౌర్యకు తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను అనుభవించిన ఆమె ఇప్పుడు అవకాశాలు లేక, డబ్బు కోసం ఇంటి ఇంటికి తిరిగి సబ్బులు అమ్ముకొంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక కష్టాలను వెల్లడించారు.

“ఈ మధ్యకాలంలో నాకు అవకాశాలు లేవు. ఆదాయం లేదు.. ఇల్లు గడవాలి.. డబ్బు కోసం ఇంటి ఇంటికి తిరిగి సబ్బులు విక్రయిస్తున్నా.. మంచి జీతం వస్తే పాచి పనులు చేయడానికి కూడా వెనుకాడను. ఇప్పుడు నేను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు అప్పులు లేవు. వేరే సమస్యలు లేవు.. నేను నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నాను. వారిని పోషించుకోవడానికి, నా కాళ్లపై నేను నిలబడిగలిగే ఏ పని అయినా చేస్తాను. యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే తింటున్నాను. నన్ను నటిగా చేసింది సీరియల్స్ మాత్రమే .. సినిమా నాకు తిండి పెట్టలేదు.. ఇప్పుడు నాకు ఒక మంచి టీవీ సీరియల్ లో అవకాశం వస్తే చాలు అనుకుంటున్నాను. నిజాయితీగా పని చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు” అని ఆమె చెప్పుకొచ్చింది. నటి ఆర్థిక కష్టాలు వింటుంటే ప్రతి ఒక్కరికి కంటనీరు రాకుండా ఉండదు. ప్రస్తుతం ఐశ్వర్య మాటలు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి ఆమెను ఆదుకోవడానికి కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా సహాయం చేస్తారేమో చూడాలి.