Site icon NTV Telugu

Kasturi: ప్రభాస్ అస్సలు రాముడిలా లేడు.. ఇలాంటి వికారమైన పనులు ఎందుకు..?

Ram

Ram

Kasturi:ఆదిపురుష్.. రిలీజ్ కు ఇంకా కొన్నిరోజులు సమయం ఉంది. ఒకప్పుడు వివాదాలతోనే ఫేమస్ అయిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది అనుకొనేలోపు మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. నిన్నటివరకు ఓం రౌత్ ముద్దు గొడవ ఎంత వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా హీరోయిన్ కస్తూరి ఆదిపురుష్ పై సరికొత్త వివాదానికి తెరతీసింది. నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన కస్తూరి.. ఇప్పుడు గృహాలక్ష్మీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను సైతం మెప్పిస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంలో అమ్మడు ముందు ఉంటుంది. ఇక తాజాగా కస్తూరి ఆదిపురుష్ చిత్రంపై , ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్తూరి రైజ్ చేసిన పాయింట్.. ఆదిపురుష్ సినిమా మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న మాటే.. కానీ, ఈ సమయంలో ఆమె ఎందుకు వివాదాస్పదం చేస్తుందో అర్ధం కావడంలేదు.

Akkineni Nagarjuna: నాగార్జున వలనే నా కెరీర్ నాశనం అయ్యింది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

అసలు ఆమె చెప్పిన విషయం ఏంటంటే.. రాముడికి, లక్ష్మణుడికి మీసాలు, గడ్డాలు ఉండవు అని.. ఈ విషయమై చాలామంది చాలా అనుమానాలను లేవనెత్తారు. ఇక కస్తూరి మాట్లాడుతూ.. “ఏ సంప్రదాయం లో అయిన రామలక్ష్మనులు గెడ్డం, మీసాల తో ఉండటం ఎక్కడైనా చూసారా? ఇలాంటి వికారమైన పనులు ఎందుకు చేస్తారు. ప్రభాస్ తెలుగు వాడు. తెలుగు లో చాలా మంది లెజెండరీ యాక్టర్స్ రామాయణం లో శ్రీరాముడి పాత్రని ధరించారు. ప్రభాస్ రాముడిలా కనిపించడం లేదు.. కర్ణుడుగా కనిపిస్తున్నాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కస్తూరి మాటలపై ఫ్యాన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే.. ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఒకసారి దర్శకుడు కోణంలో సినిమా ఆలోచిస్తే తెలుస్తుంది. సినిమా చూసాకా ఇలాంటివాటిని రైజ్ చేయండి అంటూ కస్తూరిని ఏకిపారేస్తున్నారు.

Exit mobile version