Baby Varalakshmi: సీనియర్ నటీమణి వరలక్ష్మి.. ఇప్పటితరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఆమె పేరు చాలా బాగా వినిపించేది. 1973 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి బేబీ వరలక్ష్మిగా ఆమె పేరు స్థిరపడిపోయింది. హీరోయిన్ గా, హీరోలకు చెల్లెలిగా, సపోర్టింగ్ రోల్స్ లో ఎన్నో సినిమాలు చేసింది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో దాదాపు 30 ఏళ్లపాటు ఎన్నో పాత్రలు చేసి మెప్పించింది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె కెరీర్ ను కొనసాగించింది. సినిమాలే కాదు బుల్లితెరపైన కూడా వరలక్ష్మి తనదైన నటనను కనపరిచి మెప్పించింది. ఇక ప్రస్తుతం రీ ఎంట్రీ పాత్రల కోసం ఆమె వేచి చూస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఆ ఇంటర్వ్యూ ఇప్పటిది కాకపోయినా.. వైరల్ గా మారడం విశేషం. ఆ ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన కెరీర్ ప్రస్థానం నుంచి ఇప్పుడు తాను జీవిస్తున్న జీవితం వరకు అన్ని పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
Chiranjeevi: ఏంటి.. బాసూ.. దిల్ రాజునూ అలా ఆడేసుకున్నావ్
ఇక ఈ ఇంటర్వ్యూలోనే వరలక్ష్మి తాను బాధపడిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆమె ఎక్కువగా రేప్ సీన్స్ లోనే కనిపించేది. హీరో కు చెల్లెలు.. లేదా అసహాయ భర్తకు భార్య.. ఇలాంటి పాత్రలు రేప్ చేసి చచ్చిపోవడం.. ఆ విలన్స్ పై హీరో పగ తీర్చుకోవడం.. ఇదే కథ. అందులో రేప్ చేయబడిన నటిగా వరలక్ష్మి కనిపించేది. దీంతో అందరు ఆమెను రేప్ ల వరలక్ష్మి అని అవమానించేవారు. అలా పిలిచిన ప్రతిసారి తాను ఎంతో బాధపడేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి సీన్స్ చేసి తప్పు చేశాను అని చెప్పుకొచ్చిన వరలక్ష్మి.. తన సహనటులు సైతం అలా పిలిచి హేళన చేసేవారని తెలిపింది. ఇక ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని, కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని ఆస్తులు కూడబెట్టుకున్నాను అని.. వాటితోనే హ్యాపీ గా జీవిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.