NTV Telugu Site icon

Selfish Movie Launch : ధనుష్ అతిథిగా సినిమా ప్రారంభోత్సవం

Selfish

Selfish

18 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో దర్శకుడు సుకుమార్‌ను లాంచ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత దిల్ రాజు ఓ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి “సెల్ఫిష్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది.

Read Also : Bloody Mary Movie Review : సారీ…మేరీ!

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ ధనుష్ అతిథిగా హాజరై టీమ్‌ను ఆశీర్వదించారు. అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక మూవీలో ఆశిష్ కు జోడిగా శ్రీలీల కనిపించబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ “సెల్ఫిష్” చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. కాగా జనవరిలో “రౌడీ బాయ్స్‌”తో నటనా రంగ ప్రవేశం చేసిన ఆశిష్ కి ఇది రెండవ చిత్రం.