Site icon NTV Telugu

Mega 154 : నోరు జారిన శేఖర్ మాస్టర్.. చిరు సినిమా టైటిల్ లీక్

Shekr

Shekr

మెగాస్టార్ చిరంజీవి  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే.. కొందరు వాల్తేరు వీరయ్య అంటుండగా.. మరికొందరు మాస్ మూలవిరాట్టు అని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని ఒక రేంజ్ లో అనౌన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.. అయితే అనుకోని విధంగా ఈ సినిమా టైటిల్ ను లీక్ చేశాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ తన తదుపరి సినిమాల గురించి చెప్పుకొస్తూ ” రవితేజగారు నటిస్తున్న ధమాకా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాను తమళంలో రెండు ప్రాజెక్ట్ లు అలాగే చిరంజీవిగారితో భోళా శంకర్ వాల్తేరు వీరయ్య చిత్రాలు చేస్తున్నా” అని నోరు జారాడు. ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య  అని అభిమానులు అనుకోవడమే కానీ ఎవరు కన్ఫర్మ్ చేయకపోయేసరికి అందరు కొత్త టైటిల్ వస్తుందేమో ఎదురుచూస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ ఇచ్చిన క్లారిటీ తో మెగా 154 టైటిల్ వాల్తేరు వీరయ్య అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.. మరో పక్క మేకర్స్ మాత్రం శేఖర్ మాస్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. స్పెషల్ అకేషన్ రోజున  టైటిల్ లుక్ తో సహా రిలీజ్ చేద్దామని అనుకుంటే శేఖర్ నోరుజారడంతో ఆ సర్ ప్రైజ్ మిస్ అయ్యిందని మేకర్స్ బాధపడుతున్నారట. మరి అధికారికంగా ఈ టైటిల్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

Exit mobile version