Shekhar Bhasha : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే కారణంతో నిన్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా రంగంలోకి దిగాడు. వీరిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ ను కలిసినట్టు శేఖర్ భాష తెలిపాడు. ప్రస్తుతం వారిద్దరూ షూటింగ్ బిజీలో ఉన్నట్టు తెలిపానన్నాడు.
Read Also : RCB Unbox Event: రజత్ పాటిదార్‌పై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
షూటింగ్ బిజీ వల్ల మూడు రోజులు సమయం కావాలని కోరానని.. పోలీసులు అనుమతిచ్చారని శేఖర్ మీడియాకు వివరించాడు. బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్లకు పెద్దగా తెలియదని.. ఏడాది క్రితం అలా చేశారని చెప్పుకొచ్చాడు శేఖర్ భాషా. ఇక నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ లో ఎవరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయరని.. తెలియక చేసిన దానికి వాళ్లు ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్టు గుర్తు చేశాడు శేఖర్ భాషా.