మాచో హీరో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. చాలా క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారట. సంపత్ నంది దర్శకత్వం వహించిన “సీటిమార్” చిత్రం ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్థిక సమస్యలు, లాక్డౌన్, కరోనా వంటి కారణాలతో సినిమా వాయిదా పడింది. దీంతో ఇటీవల ఈ మూవీ ఇతర సినిమాల మాదిరిగా ఓటిటిలో రిలీజ్ అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి.
Read Also : ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన “సర్కారు వారి పాట”
ఈ క్రమంలో థియేటర్లు రీఓపెన్ కావడంతో మేకర్స్ థియేట్రికల్ రిలీజ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ‘జ్వాలా రెడ్డి’, ‘పెప్సీ ఆంటీ’ సాంగ్స్ కు మంచి స్పందనే వచ్చింది. ఇక ఈ చిత్రం గోపీచంద్, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్ లుగా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
