Site icon NTV Telugu

Seetha Kalyana Vaibhogame: రామాయణ ఆధారంగా ‘సీతా కళ్యాణ వైభోగమే’

Kalyana Vaibhogame

Kalyana Vaibhogame

Seetha Kalyana Vaibhogame to Release on April 26th: సుమన్ తేజ్, గరిమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెకెక్కింది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన, ఇది రెండో సినిమా.

రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశా, మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. నటుడు గగన్ విహారి మాట్లాడుతూ.. ‘ధర్మపురితో హీరోగా నాకు మంచి పేరు వచ్చింది, దర్శకుడు సతీష్ సీతా కళ్యాణ వైభోగమే కథ చెప్పారు, టైటిల్ వింటేనే ఎంతో హాయిగా అనిపించిందన్నారు. రాముడు, సీత అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తీశారు, ఇందులో నేను చాలా వైల్డ్‌గా కనిపిస్తా, అని అన్నారు. ఈ సినిమాకి సంగీతం చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలాకి విజయ్ పనిచేస్తున్నారు.

Exit mobile version