Site icon NTV Telugu

Naa Saamiranga: తాగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయని ఈ పాట వినే వరకు తెలియదు బ్రో…

Naa Saamiranga

Naa Saamiranga

కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో రేపు ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. పండక్కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున… నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ తో అక్కినేని అభిమానుల్లో మంచి జోష్ తెచ్చాడు. ఇదే జోష్ లో రేపు థియేటర్స్ కి వెళ్లిపోవడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ చేస్తున్న నా సామిరంగ చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి “సీసా మూత ఇప్పు” సాంగ్ బయటకు వచ్చింది. ఈ సాంగ్ వింటే అసలు ఒక మనిషి తాగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా అనిపించడం గ్యారెంటీ. సాంగ్ పేరుకి తగ్గట్లే సీసా మూత ఇప్పడానికి అవసరమైన కారణాలని చెప్తూ సాగిన ఈ పాట చాలా క్యాచీగా ఉంది.

Read Also: Prabhas Maruthi: రెబల్ ఫ్యాన్స్ కి థమన్ భయం?

అల్లరి నరేష్, నాగార్జున, రాజ్ తరుణ్… తాగుతూ పాడుకున్న ఈ పాటని రాబోయే రోజుల్లో మందుబాబుళ్లంతా పాడుకుంటారు. డీజే మిక్స్ కొడితే “సీసా మూత ఇప్పు” సాంగ్ ట్రెండ్ కూడా అవుతోంది. చంద్రబోస్ ఇంత క్యాచీగా లిరిక్స్ ని రాస్తే… కీరవాణి వినగానే కనెక్ట్ అయ్యే ట్యూన్ ని ఇచ్చాడు. సింగర్స్… మల్లికార్జున్, రేవంత్, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్ లు సాంగ్ కి తగ్గ వోకల్స్ ఇచ్చి పాటని మరింత ఎలివేట్ చేసారు. ఈ సాంగ్ కొంచెం ముందు రిలీజ్ అయ్యి ఉంటే నా సామిరంగ సినిమాకి ఇంకా బజ్ జనరేట్ అయ్యేది.

Exit mobile version