Site icon NTV Telugu

Sita Ramam: కానున్న కళ్యాణం.. సిరివెన్నెల చేతి నుంచి జాలువారిన మరో ఆణిముత్యం

Sitaramam

Sitaramam

Sita Ramam: మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాళి ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సీతా రామం. వైజయంతి మూవీస్ సమర్పిస్తూ స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపిస్తుండగా.. అక్కినేని సుమంత్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. కానున్న కళ్యాణం అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇక ఈ సాంగ్ ను దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాయడం విశేషం. సాంగ్ మొదటిలోనే సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఆణిముత్యం అంటూ ఆయనను గుర్తుచేసుకున్న తీరు ఆకట్టుకొంటుంది.

మంచు కొండల్లో పెళ్లి కూతురి ముస్తాబులో మృణాళి ఠాకూర్ ఎంతో అందంగా కనిపిస్తుండగా.. మిలటరీ డ్రెస్ లో దుల్కర్ తన ప్రేమను తెలుపుతూ కనిపించాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి, సింధూరి మెస్మరైజ్ చేసే వాయిస్ సంగీత అభిమానులను వేరే లోకంలోకి తీసుకెళ్తోంది. ఈ మధ్య వచ్చిన కూల్ సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ కూడా చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. యుద్ధంతో రాసిన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానులు భారీ ఆంచనాలు పెట్టుకున్నారు. ఆగస్టు 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version