Site icon NTV Telugu

SC, ST Controversy : విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు

Vijyadevarakonda

Vijyadevarakonda

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై SC, ST  అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేడుకలో విజయ్ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాడు.  విజయ్ దేవరకొండ  కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దాంతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్.

Also Read : Sandalwood : కన్నడలో మరో కాంట్రవర్సీ.. ఈ సారి హీరోయిన్ వంతు

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ‘ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా, తీవ్రంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు. అనే వ్యాఖ్యల ద్వార మా గిరిజన సమాజాన్ని అవమానపరిచారు. అంతేకాకుండా మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చేలా వాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మా గిరిజనుల ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇలాంటి వాఖ్యలు Scheduled Castes and Schduled Tribes (Prevention of Atrocities) Act, 1989 ప్రకారం శిక్షార్హమైనవిగా పరిగణించబడతాయి. కావున విజయ్ దేవరకొండ  పై తక్షణమే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకోని మా గిరిజన సమాజానికి న్యాయం చేస్తారని గాఢంగా నమ్ముతున్నాము’ అని పేర్కొన్నారు. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు.

Exit mobile version