NTV Telugu Site icon

DISNEY+ HOTSTAR: క్లీన్ కామెడీతో ‘సేవ్ ద టైగర్స్’!

Save

Save

Mahi V Raghav: ‘పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి. రాఘవ, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న వెబ్ సీరిస్ ‘సేవ్ ద టైగర్స్’. ఈ వెబ్ సీరిస్ తో నటుడు తేజా కాకుమాను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నెల 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సీరిస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సీరిస్ వివరాలు తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోర్దార్ సుజాత మాట్లాడుతూ, “ఇది నా ఫస్ట్ వెబ్ సిరీస్. ఇప్పటి వరకు యాంకరింగ్ చేశాను. యాక్టింగ్ చేయడం మొదటి సారి. ఇందులో హైమావతి అనే గృహిణిగా నటించాను. భర్తను మోటివేట్ చేస్తూనే విపరీతంగా సతాయిస్తూ ఉండే భార్య పాత్ర” అని అన్నారు. మరో నటి దేవయాని మాట్లాడుతూ, “ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహి సర్ కు థాంక్స్. మా దర్శకుడు తేజ గారితో పాటు ప్రదీప్ గారి సపోర్ట్ మర్చిపోలేను. నా కో యాక్టర్ చైతన్య తో వర్కింగ్ ఎక్సపీరియెన్స్ బావుంది” అని తెలిపింది. నటి పావని మాట్లాడుతూ, “ఈ సిరీస్ తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సిరీస్ చూసిన తరవాత మా వారు కొన్ని నిజాలు తెలుసుకుంటారు. నాతో పాటు నటించిన అభినవ్ నేను టామ్ అండ్ జెర్రీ లా ఉండేవాళ్ళం. అది మా పాత్రల్లో కూడా సహజంగా కుదిరింది” అని అన్నారు.

నటుడు అభినవ్ గోమఠం మాట్లాడుతూ, “నా కెరీర్ తొలినాళ్ళలో ప్రదీప్ అద్వైతం అన్నతో పనిచేశాను. ఇప్పుడు కొంత ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నతో వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది. ఇందులో అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చేలా రాసుకున్నారు. వెబ్ సిరీస్ అనగానే అందరూ థ్రిల్లర్ అనుకుంటారు. బట్ ఇది క్లీన్ కామెడీ తో వస్తుండటం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచుతుంది అనుకుంటున్నాను” అని చెప్పారు. చైతన్య కృష్ణ మాట్లాడుతూ, “కోవిడ్ టైం లో నాకు ఈ స్క్రిప్ట్ పంపించారు. బేసిక్ టైటిల్ ‘సేవ్ ది టైగర్స్’ అనేది తీసేస్తే.. భర్తలను కాపాడుకుందాం అనేది మెయిన్ స్టోరీ. నేను ఒక అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ గా నటించాను. నా వైఫ్ లాయర్. అలాంటి భార్య ఉంటే ఆ భర్తలు ఎలా నలిగిపోతారు అనేది హిలేరియస్ గా ఉంటుంది” అని అన్నారు.

షో రన్నర్ మహి వి రాఘవ మాట్లాడుతూ, “డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళ వల్లే ఈ సిరీస్ సాధ్యం అయింది. ఈ మొత్తం క్రెడిట్ అంతా ప్రదీప్ దే. ఏ కథ అయినా రైటింగ్ టేబుల్ పైనే తెలిసిపోతుంది. ఈ విషయంలో ప్రదీప్ ది బెస్ట్ ఇచ్చాడు. నేను ఒకే ఒక కామెడీ సినిమా చేశాను. ప్రతి ఇంట్లోనూ ఒక కామెడీ స్టోరీ ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉండే జోక్ ఎప్పుడు ఫెయిల్ కాదు. ఎవరి యుద్ధం వాళ్ళది. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెబితే వినేవారు. ఇప్పుడు భార్య భర్త జాబ్స్ చేయడం వాల్ల ఒక డామినేటింగ్ వస్తోంది. అది ఒక సంఘర్షణ కు దారి తీస్తోంది. ఓ.టి.టి.లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే పరిస్థితి లేదు. మా సిరీస్ ఖచ్చితంగా అందరు చూసేలా ఉంటుంది” అని అన్నారు.