NTV Telugu Site icon

Satyadev: ‘ఫుల్ బాటిల్’ ఎత్తబోతున్న యంగ్ హీరో!

Full Bottle

Full Bottle

యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు కొరటాల శివ సమర్పణలోనూ తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలానే హిందీలో అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న ‘రామసేతు’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్

ఇదిలా ఉంటే… సత్యదేవ్ హీరోగా ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా షూటింగ్ బుధవారం మొదలైంది. ‘కిర్రాక్ పార్టీ’తో పాటు సత్యదేవ్ హీరోగా ఇటీవల ‘తిమ్మరుసు’ చిత్రాన్ని తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి ‘ఫుల్ బాటిల్’కు దర్శకత్వం వహిస్తున్నాడు. రామాంజనేయులు జువ్వాజి, ఎస్.డీ. కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తొలి రెండు చిత్రాలు కన్నడ రీమేక్స్ కాగా, ఇటీవల అతను జీ 5 కోసం ‘గాలివాన’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేశాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ‘ఫుల్ బాటిల్’ మూవీ కాకినాడ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. మరి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్న సత్యదేవ్ కు ‘ఫుల్ బాటిల్’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.