Krishnamma : మే 10కి వాయిదా పడ్డ సత్యదేవ్ ‘కృష్ణమ్మ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Dev’s ‘Krishnamma’ moves to May 10th Release Date : హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సత్యదేవ్. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్పరిమెంటల్ సినిమా అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 3న రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాన్ని మే 10కి వాయిదా వేశారు. ఈ సినిమాకు వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Producer Gnanavel Raja: పనిమనిషి ఆత్మహత్యాయత్నం.. ప్రముఖ నిర్మాతపై కేసు?
Also Read
ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి. ఇక‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.., దుర్గమ్మ అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా ‘కృష్ణమ్మ’ నిలవనుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటర్ తమ్మిరాజు రాజు కాగా రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అనంత శ్రీరాం పాటలు అందించిన ఈ సినిమాకి పృథ్వీ శేఖర్ ఫైట్స్ అందించారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!