Satyadev: టాలీవుడ్ వెర్సటైల్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఒక్క హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపిస్తూ పూర్తి నటుడిగా పేరుతెచ్చుకుంటున్నాడు. ఇక సత్యదేవ్ నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సత్యదేవ్ తన గత స్మృతులను అభిమానులతో పంచుకున్నాడు. తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని, గాడ్ ఫాదర్ లో ఆయనతో కలిసి నటించడంతో తన జన్మ ధన్యమయ్యిందని చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు తన నుదిటి మీద దెబ్బ తగలడానికి చిరుని కారణమని, ఆయన సినిమాలో సీన్ ప్రాక్టీస్ చేస్తూ కిందపడి దెబ్బ తగిలిందని చెప్పుకొచ్చాడు.
ఇక ఒక సినిమా కోసం ఆఫ్గనిస్తాన్ షూటింగ్ కు వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన సంఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. ” షూటింగ్ కోసం మేము ఆఫ్గనిస్తాన్ వెళ్ళాం.. అక్కడ షూటింగ్ చేసుకొని వస్తుండగా ఎయిర్ పోర్టులో నన్ను సూసైడ్ బాంబర్ అనుకోని అరెస్ట్ చేశారు. సాధారణంగా సూసైడ్ బాంబర్స్ కాలికింద ట్రిగ్గర్ పెట్టుకుంటారు. నా పక్కన కూర్చున్న వ్యక్తి తన కాలు కింద ఏదో పెట్టుకొని దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. అది చూసిన పోలీసులు వెంటనే అనుమానం వచ్చి అతడిని, అతడి పక్కన ఉన్న నన్ను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ ఆతరువాత మా చిత్ర బృందం వచ్చి మేము షూటింగ్ చేయడానికి వచ్చామని చెప్పడంతో వదిలేశారు” అని చెప్పుకొచ్చాడు.