Sathi Gani Rendu Ekaralu: పుష్ప సినిమా చూసాకా అల్లు అర్జున్ ఎంతగా గుర్తుపెట్టుకుంటారో అల్లు అర్జున్ పక్కన ఉన్న ఫ్రెండ్ కేశవను కూడా అంత గుర్తుపెట్టుకుంటారు. సినిమా మొత్తం అతడి వాయిస్ ఓవర్ మీదనే నడుస్తూ ఉంటుంది. ఒక్క సినిమా.. ఆ ఒక్క సినిమాతో ఫేమస్ అయిపోయాడు జగదీశ్ ప్రతాప్. అదేనండీ కేశవ అసలు పేరు. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్న జగదీశ్.. ప్రస్తుతం హీరోగా మారాడు. సత్తిగాని రెండు ఎకరాలు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ కు అభినవ్ దండా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆహాలో ఈ సిరీస్ మే 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అసలు ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఈ సిరీస్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
TigerNageswaraRao: గజదొంగ చనిపొతే మూడు లక్షల మంది చూడడానికి వచ్చారట
సత్తిగానికి ఊర్లో రెండెకరాల పొలం ఉంటుంది. అతడికి పుట్టిన బిడ్డకు హార్ట్ లో హోల్ ఉంటుందని వైద్యులు చెప్తారు. దీంతో ఆ రెండెకరాల పొలాన్ని అమ్మేయడానికి నానాతంటాలు పడుతుంటాడు. అయితే ఆ పొలాన్ని కొనడానికి ఎవరు ముందుకు రారు. ఈ నేపథ్యంలోనే సత్తిగానికి యాక్సిడెంట్ అయిన కారులో ఒక సూట్ కేస్ కనిపిస్తూ ఉంటుంది. ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసిన అనిభవం ఉన్న సత్తి.. ఆ సూట్ కేస్ ను కొట్టేస్తాడు. ఇక ఆ సూట్ కేస్ వెన్నెల కిశోర్ ది కావడంతో తన సూట్ కేస్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇక అక్కడనుంచి పోలీసులు సత్తిగాని వెనుక పడుతుంటారు. మధ్యలో అదే కారులో ఒక శవం దొరుకుతుంది. ఆ హత్య కేసు.. సత్తి మెడకు చుట్టుకుంటుంది. అసలు ఆ సూట్ కేస్ లో ఏముంది..? హత్య చేసింది ఎవరు..? సత్తిగాని రెండు ఎకరాలు అమ్మాడా..? లేదా..? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ట్రైలర్ ను బట్టి ఇదొక విలేజ్ కామెడీ డ్రామాగా కనిపిస్తుంది.మరి ఈ సిరీస్ పుష్ప గాడి ఫ్రెండ్ కు హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి.
