‘పలాస 1978’తో అందరి దృష్టినీ ఆకర్షించిన రక్షిత్ అట్లూరి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ తో కలసి ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ పేరుతో ఈ సినిమా తీస్తున్నారు. కోమలీ ప్రసాద్ హీరోయిన్. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. టీజర్లో ‘కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. జాతిని, నీతిని నిర్మించలేరు’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గోడపై చూపించడం ద్వారా సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ‘అందమైన, అర్థవంతమైన ప్రేమకథా చిత్రం ఇది. కాన్సెప్ట్ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని నిర్మాత అహితేజ బెల్లంకొండ చెబుతున్నారు.