Site icon NTV Telugu

Sasivadane: కోనసీమ అందాలతో పోటీపడిన కోమలి ప్రసాద్!

Sasivadana Movie

Sasivadana Movie

Sasivadane Movie Shooting Process: గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన తెరకెక్కిస్తున్నాడు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కోనసీమలోని అందమైన లొకేషన్స్ లో అందాల ముద్దుగుమ్మ కోమలి ప్రసాద్, రక్షిత్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ యాభై రోజుల పాటు జరిగిందని నిర్మాత అహితేజ చెప్పారు. మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని అన్నారు.

ఈ షెడ్యూల్ విశేషాల గురించి అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, ”శశివదనే’ చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించాం. అద్భుతమైన అనుభవం, జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు. ‘శశివదనే’లో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పడానికి ఈ రోజు విడుదల చేసిన వీడియో ఓ నిదర్శనం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్‌స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్, హై స్టాండర్డ్స్‌తో సన్నివేశాలు వస్తాయి. ‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్నాడు.

గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘శశివదనే’ చిత్రంలో హీరో చాలా చక్కని నటనను కనపరచాడు. హీరోయిన్ కోమలి ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది. చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన సెలెక్ట్ చేసుకున్న గోదావరి నేపథ్యంలోని లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కించాడు. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు.

Exit mobile version