సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు మహేష్. “ఎవరు మీలో కోటీశ్వరులు” గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు మహేష్ తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. గేమ్ షోలో సినిమా గురించి కొన్ని వివరాలను మహేష్ పంచుకోవాలని ఎన్టీఆర్ పట్టుబట్టారు.
Read Also : నీలాంటి వారిని చూస్తే ఈర్ష్య… మహేష్ పై ఎన్టీఆర్ కామెంట్
“ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. ‘సర్కారు వారి పాట’లో పూరీ జగన్నాథ్ ఫ్లేవర్ ఉంటుంది. పరశురామ్ బాగా వర్క్ చేస్తున్నాడు. పూరి జగన్ డైరెక్షన్‌లో స్టైల్, ఎసెన్స్‌తో సినిమా ఉంటుంది. నేను ‘సర్కారు వారి పాట’ వంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ చిత్రం చేసి చాలా కాలం అయ్యింది” అని అన్నారు. మహేష్ తన తదుపరి ప్రొడక్షన్ వెంచర్ “మేజర్” గురించి కూడా ఓపెన్ అయ్యారు. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ముంబై 26/11 దాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్. “సినిమాలో నా ప్రమేయం చాలా తక్కువ. నేను కొన్ని రష్‌లను చూశాను. సినిమా బాగా వచ్చినందుకు టీంను చూసి నేను గర్వపడుతున్నాను” అని మహేష్ అన్నారు.
