Site icon NTV Telugu

Sarkaru Vaari Paata Twitter Review: సర్కారు వారు చించేశారట..

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత నేడు(మే 12) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను కాలర్ ఎత్తుకొనేలా చేస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్ రివ్యూ అదిరిపోతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్.. ఇది కదా మాకు కావల్సిన ఎంటర్ టైన్మెంట్ అంటూ హంగామా షురూ చేశారు. “ఫస్టాఫ్‌ గుడ్‌. మహేశ్‌ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్‌ షో” అంటూ ఓ నెటిజన్‌ తన రివ్యూని పోస్ట్‌ చేశాడు.

“మహేష్ యాక్టింగ్ సూపర్.. కీర్తి కొద్దిగా బక్కగా కనిపించినా పర్వాలేదు తన పాత్రకు తాను న్యాయం చేసింది. మహేష్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది.. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్” అని మరో నెటిజన్ తన ట్వీట్ చేశాడు. ఇక అక్కడక్కడా కొన్న సీన్స్ ఆకట్టుకోలేకపోయానని, కానీ మహేష్ తన నటనతో వాటిని మర్చిపోయేలా చేశాడని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ టాక్ పాజిటివ్ గా రావడంతో సర్కారువారు థియేటర్ లో చించేశారని, మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకొని తిరగొచ్చని అభిమానులు గట్టిగా చెప్తున్నారు. మరి టాక్ పరంగా హిట్ అంటున్నా రికార్డుల పరంగా ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.

https://twitter.com/venkyreviews/status/1524479192930435074?s=20&t=VykNOk0iP3Q2Z4skM3BhCA

Exit mobile version