Sarkaru Vaari Paata: ఈసారి సర్కారువారు ‘పెన్నీ’ అంటూ వస్తున్నారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మొదటి పాట కళావతి సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే రెండో పాటపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక తాజాగా ఈ రెండో పాట రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. పెన్నీ అంటూ సాగే ఈ సాంగ్ ని మార్చి 20 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా మహేష్ న్యూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని లెదర్ జాకెట్ – బ్లాక్ ప్యాంట్ లో ఉబర్ కూల్ అండ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ఇక పెన్నీ అంటే డబ్బులు అని అర్ధం వస్తుంది.. మరి ఈసారి టైటిల్ కి తగ్గట్టు ఈ సాంగ్ ఉండబోతుందని అభిమానులు అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సాంగ్ కూడా కళావతి లా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
Also Read
From Our #SarkaruVaariPaataMusic ⭐️💣 Will Be Our Next #SVPSecondSingle
FROM 20’TH MARCH 🔥
WILL HIT UR EARBUDS WITH SOME THUGS ⭐️#SuperStarShining 😻🏆
LETS START GROOVING TO #PENNYSONG 💰 pic.twitter.com/NVAhCsZF1Z
— thaman S (@MusicThaman) March 17, 2022
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!