సూపర్ స్టార్ మహేష్ బాబు (ఆగస్టు 9) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టారు. కామన్ డీపీలు, హ్యాష్ ట్యాగ్స్, బ్యానర్లు, ప్లెక్సీలు, అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.. ఇక ఆయన అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఆగస్టు 9న సర్ ప్రైజ్ రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బర్త్ డే బ్లాస్టర్ విడుదల సమయాన్ని ప్రకటించించారు. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు స్పెషల్ వీడియోని రిలీజ్ అవుతుందని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన GIF లో మహేష్ తన నడుముకున్న బెల్ట్ ని గట్టిగా బిగించారు. కరోనాకు ముందు అప్డేట్స్ విషయంలో సైలెంట్ గా వున్నా చిత్రబృందం.. ప్రస్తుతం సర్కారు వారి నోటీసులతో అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. మహేష్ సరసన కీర్తిసురేశ్ నటిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 13, 2022న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అప్డేట్: సర్కారు వారు బెల్ట్ బిగించారు
