సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో “టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్” మూవీగా మోత మోగించింది. 2021 జనవరి 1 నుంచి జూన్ 30 మధ్యలో ఇండియాలో సినిమాలకు సంబంధించి “మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్”లకు సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ముందంజలో ఉన్నారు. తమిళ సినిమాలు అజిత్ “వాలిమై” ఇందులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, విజయ్ “మాస్టర్” మూవీ రెండవ స్థానంలో ఉంది. మహేష్ బాబు “సర్కారు వారి పాట” మూవీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ టాప్ 10 లిస్ట్ లో టాలీవుడ్ నుంచి కేవలం రెండంటే రెండు సినిమాలు మాత్రమే స్థానాన్ని దక్కించుకున్నాయి. మొదటిది “సర్కారు వారి పాట”, రెండవది “వకీల్ సాబ్”. పవన్ కోర్టు డ్రామా పదవ స్థానంలో నిలిచింది.
Read Also : సలార్ అప్డేట్ : రాజమన్నార్ వచ్చేశాడు !
మహేష్ “సర్కారు వారి పాట” కనీసం పాన్ ఇండియా మూవీ కూడా కాదు. అయినప్పటికీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. ఇప్పటికే ఆగష్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే” బ్లాస్టర్ అంటూ వచ్చిన టీజర్ రికార్డులు అన్నింటినీ బ్లాస్ట్ చేసేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో “టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్” మూవీగా నిలిచి ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఆర్. మది, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్ నిర్వహించారు. ఈ చిత్రం 13 జనవరి 2022న విడుదల కానుంది. మరి “సర్కారు వారి పాట” విడుదలైతే ఇంకెన్ని రికార్డులను బ్లాస్ట్ చేస్తుందో చూడాలి.
