NTV Telugu Site icon

Sarkaru Vaari Paata: ప్రాఫిట్ జోన్‌లోకి ఎంట్రీ.. డబుల్ సెంచరీకి చేరువలో!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ నమోదవుతాయని ‘సర్కారు వారి పాట’ మరోసారి నిరూపించింది. సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్న ఈ చిత్రం.. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు తిరిగి సాధారణ ధరలకే అందుబాటులోకి రావడంతో.. రెండో వారాంతంలోనూ ఇది అదిరిపోయే వసూళ్ళు కొల్లగొట్టింది.

ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డుల్ని పటాపంచలు చేసిన ఈ చిత్రం.. సెకండ్ వీకెండ్ రన్ తర్వాత టాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన రీజనల్ సినిమాగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. బ్రేకీవన్ టార్గెట్‌ని కూడా అందుకుంది. దీంతో, ఇంత వేగంగా బ్రేకీవన్‌కి చేరిన రీజనల్ మూవీగా మరో రికార్డ్‌ని ‘సర్కారు వారి పాట’ తన పేరిట లిఖించుకుంది. ఆల్రెడీ ఈ చిత్రం రూ. 100 కోట్ల షేర్ మార్క్‌ని దాటేయగా, ఇప్పుడు రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్‌కి చేరువలో ఉంది. మహేశ్ గత చిత్రాలైన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రూ. 100 కోట్లకుపైగానే షేర్ కలెక్ట్ చేశాయి. ఇప్ప్పుడు ‘సర్కారు వారి పాట’ కూడా ఆ మార్క్‌ని దాటేసింది. తద్వారా.. తెలుగులో నాలుగు రూ. 100 కోట్ల షేర్ సినిమాలు కలిగిన హీరోగా మహేశ్ అరుదైన రికార్డ్ సాధించాడు.

అంతేకాదండోయ్.. ఓవర్సీస్‌లో ఈ చిత్రం సరిలేరు నీకెవ్వరు లైఫ్‌టైమ్ కలెక్షన్ల మార్క్‌ని కూడా సర్కారు వారి పాట దాటేసింది. నిన్న 155 లొకేషన్స్ నుంచి $26,573 ఈ సినిమా రాబట్టడంతో.. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో రూ. $2,291,728 నమోదైంది. ఈ వారంలో పోటీగా ఏ ఇతర సినిమాలు లేకపోవడంతో, ఈ అవకాశాన్ని ‘సర్కారు వారి పాట’ సద్వినియోగం చేసుకుంటోంది. చూస్తుంటే.. ఈ సినిమా మహేశ్ బాబు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్ గ్రాసర్‌గా నిలవబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక 11 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్ల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి…

ఏపీ+తెలంగాణ: 153.8 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 14.9 కోట్లు
ఓవర్సీస్: 27.4 కోట్లు
టోటల్ = రూ. 196.1 కోట్లు (గ్రాస్)